ముందుగా ఐదుగురితో ఈ వృద్ధాశ్రమం ప్రారంభించటం జరిగినది. నా పిల్లలు
నా జీవనం కోసం ఇస్తున్న 25 వేల రూపాయలు నేను ఒక్కదాన్నే అనుభవించుటకు నా మనస్సు అంగీకరించలేదు.
కళ్లముందే కనబడుతున్న త్రోసివేసిన, విడువబడిన, నిరాకరించబడిన వృద్ధులు కనబడుతుంటే నేను
ఒక్కదానిని ఆనందించుట న్యాయమనిపించలేదు. తరువాత మెల్లమెల్లగా 24 వృద్ధులను చేర్చుకున్నాను.
ఇప్పుడు నాకు ఈ సేవా కార్యక్రమము భారంగా మారింది. ఐనా కూడా ఈ వృద్ధులు అంతా ఒకచోట చేరి
తమ ఒంటరి జీవితాన్ని మరచి, ఆనందంగా ఉన్నారు కదా, వీ రి సంతోషం ఎప్పటికి ఇలాగే ఉండాలనే ఆశతో
ముందుకు నడిపిస్తున్నాను. ఎటువంటి ఆధారం లేకుండా, అనేక కష్టాలు పడుతూ ఒంటరిగా జీవించే
వృద్ధుల ఆలనాపాలన చూసుకోవడానికి మంచి ఆహ్లాదకర వాతావరణంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు
చేయ సంకల్పించాము. పరిస్థితులకనుగుణంగా ఈ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యులతో
కలిసి సంతోషంగా జీవిస్తున్నాం అనే భావన వారిలో కలగాలని నా ఆకాంక్ష.

No comments:
Post a Comment