Site Buttons

Wednesday, 9 April 2014

వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పములో భాగంగా దాతల నుండి స్థల సేకరణ, నిర్మాణము కొరకు కొంత శక్తిని, సహాయ, సేవ రూపములలో ఆహ్వానిస్తున్నాము

మమ్మీ-డాడీ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పములో భాగంగా దాతల నుండి స్థల సేకరణ, నిర్మాణము కొరకు కొంత శక్తిని, సహాయ, సేవ రూపములలో ఆహ్వానిస్తున్నాము

నమస్సుమాంజలి!

వృద్ధాప్యమును ఎవ్వరూ తప్పించుకొలేరు. కాబట్టి వృద్ధాప్యం శాపముగా భావించకూడదు. బాల్యం నుంచి వృద్ధాప్య దశ మధ్యకాలంలో కోట్లాదిమంది ప్రజలు ఎన్నో మైలురాళ్లను అధిగమించి ఉంటారు. ఎన్నో అనుభవాల ద్వారా ప్రయాణించి అలసిపోయి ఉంటారు. మంచి అనుభవాలు, చెడ్డ అనుభవాలు గత కాలపు అనుభవాలు స్మరించుకుంటూ ఏమి చేయలేని స్థితికి నిరుత్సాహంగా కాలం గడుపుతూ, ఎవ్వరూ తమతో సమయం గడుపుటకు ఇష్టపడక పోవటం, వారిని మరీ కృంగదీస్తూ ఉంటే శూన్యంలోకి చూస్తూ సంవత్సరాలు, సంవత్సరాలు జీవితం గడుపుతూ ఉంటారు.

ఒక పక్క వృద్ధాప్యం మరోవైపు క్షీణిస్తున్న ఆరోగ్యం, పిల్లల నిర్లక్ష్యానికి గురౌతూ, ఎన్నో సంవత్సరాలు తమతో జీవితం పంచుకొనిన సహచరులను (భార్య లేక భర్త) కోల్పోయి మనసులోని బాధను, భావాలను పంచుకోవడానికి తోడులేక వృద్ధులు పడుతున్న బాధను ఎవ్వరూ వర్ణించలేరు. కళ్లముందే జరుగుతున్న ఈ సంఘటనలు నేను చూసి చలించిపోయాను. ఆ వృద్ధుల కోసం ఏదయినా చేయాలనుకున్నాను. కొంత మంది మిత్రులను కలిసి చర్చించి చివరకు ఓ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి, తిరిగి మునుపటి ఉత్సాహం వారిలో చూడాలని ఎటువంటి ఆధారం లేకుండా, అనేక కష్టాలు పడుతున్న ఇటువంటి వృద్ధుల శేష జీవితం ప్రశాంతంగా గడిచి పోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ, ఈ సేవా యజ్ఞానికి సిద్దపడ్డాను. అవసాన దశలో రోడ్డున పడకుండా వారిని ఆదుకునే ఉద్దేశ్యంతో మా మిత్రులతో కలిసి మేమీ పనికి శ్రీకారం చుట్టాం. మా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు సేవలందిస్తూనే ఉంటాం.


ఉమ్మడి కుటుంబంలో వృద్ధులను అందరూ ప్రేమతో గౌరవంతో చూసేవారున్నారు. కానీ ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాల సంస్కృతి ఎక్కడా కనిపించడం లేదు. ఉద్యోగాల పేరుతో పిల్లలంతా ఇళ్లు వదిలి వెళ్లిపోతుంటే వయస్సు మళ్లిన వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. కొంతమంది తల్లి తండ్రులను పనివారిగా చూస్తూ వృద్ధులు అనే జ్ఞానం కూడా లేకుండా విపరీతమైన చాకిరి చేయించుకుంటూ కడుపునిండా అన్నంకూడా పెట్టకుండా తల్లి తండ్రులు కట్టించిన వారి ఇంటి నుంచే బయటికి ఏ సౌకర్యంలేని రేకుల షెడ్లలో వారికి వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఈ వృద్ధులు ప్రేమతో పెంచిన తమ బిడ్డలనుండి ఒక చిన్న పలకరింపు, కొద్దిపాటి ఆప్యాయత కోసం పడే బాధ నిజంగా శోచనీయము. ఇలాంటి వారి కోసమే వృద్ధాశ్రమాలు ఏర్పడ్డాయి. ఇక్కడ తమ వయస్సు వారితో కలిసి సంతోషంగా జీవిస్తూ ఒకరికొకరు సలహాలిస్తూ, ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ వయస్సుతో నిమిత్తం లేకుండా సమస్తము మరచి ఆనందంగా, తిరిగి వారిలో మరలా యవ్వనం వచ్చిందా అనేలా జీవిస్తున్నారు. అలాంటి వాతావరణం ఆశ్రమ నిర్వాహకులమైన మేము కలిగిస్తున్నాము.

ఈ విధంగా మమ్మీ-డాడీ వృద్ధాశ్రమాన్ని నడపడం కోసం చాలా మంది సహాయ సహాకారాలు అందజేశారు. పవర్ మినిస్ట్రీస్ పేరుతో ఆ ఆశ్రమాన్ని రిజిష్టర్ చేయించాను. ప్రస్తుతం నిలువనీడలేని 24 మంది వృద్ధులు మా ఆశ్రమంలో ఉన్నారు. పేద వృద్ధులకు కంటి ఆపరేషన్లు చేయించి వారికి చూపునిచ్చే మహా భాగ్యాన్ని నాకు కల్పించిన ఆ భగవంతునికి నేను మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఆర్థిక వనరులు:
ప్రస్తుతం ఆశ్రమం అద్దె భవనంలో నిర్వహిస్తున్నాను. నెలకు రూ. 12 వేలు పైగా అద్దె చెల్లించాల్సి వస్తోంది. గతంలో అయితే మొత్తం ఖర్చును నేను సొంతంగా భరించాను. కానీ సంవత్సరం నుంచి కొంతమంది తమ బిడ్డల పుట్టిన రోజు వేడుకలను మా ఆశ్రమంలో జరుపుకుంటూ ఇక్కడ ఉన్న వారికి చీరలు, దుప్పట్లు, పండ్లు, స్వీట్లు వంటి వాటిని పంచిపెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆశ్రమభవనం సరిపోవడం లేదు. పైగా అద్దె కూడా భారంగా ఉన్నది. మేము వృద్ధాశ్రమం నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రముఖులు ముందుకు వచ్చి ఆర్ధికంగా లేక వనరుల రూపంలో సహాయము చేసినయెడల, ఎలాంటి లాభాపేక్షలేకుండా సేవే పరమావధిగా ఈ వృద్ధాశ్రమం ముందుకు నడిపించాలని నాఆకాంక్ష, ఆశ కూడా ఉంది. తరువాతి తరముల వారిలో కూడా ఇలాంటి సేవా దృక్పథం కలిగేలా, తల్లి తండ్రులను గౌరవించేలా యువతరంలో ఆసక్తి కలిగించుటకు నేను ప్రయాసపడుతున్నాను.



ఆకాంక్ష:
ముందుగా ఐదుగురితో ఈ వృద్ధాశ్రమం ప్రారంభించటం జరిగినది. నా పిల్లలు నా జీవనం కోసం ఇస్తున్న 25 వేల రూపాయలు నేను ఒక్కదాన్నే అనుభవించుటకు నా మనస్సు అంగీకరించలేదు. కళ్లముందే కనబడుతున్న త్రోసివేసిన, విడువబడిన, నిరాకరించబడిన వృద్ధులు కనబడుతుంటే నేను ఒక్కదానిని ఆనందించుట న్యాయమనిపించలేదు. తరువాత మెల్లమెల్లగా 24 వృద్ధులను చేర్చుకున్నాను. ఇప్పుడు నాకు ఈ సేవా కార్యక్రమము భారంగా మారింది. ఐనా కూడా ఈ వృద్ధులు అంతా ఒకచోట చేరి తమ ఒంటరి జీవితాన్ని మరచి, ఆనందంగా ఉన్నారు కదా, వీ రి సంతోషం ఎప్పటికి ఇలాగే ఉండాలనే ఆశతో ముందుకు నడిపిస్తున్నాను. ఎటువంటి ఆధారం లేకుండా, అనేక కష్టాలు పడుతూ ఒంటరిగా జీవించే వృద్ధుల ఆలనాపాలన చూసుకోవడానికి మంచి ఆహ్లాదకర వాతావరణంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయ సంకల్పించాము. పరిస్థితులకనుగుణంగా ఈ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాం అనే భావన వారిలో కలగాలని నా ఆకాంక్ష.

విజ్ఞప్తి:

ఆహ్లాదకర వాతావరణంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పములో భాగంగా దాతల నుండి స్థల సేకరణ, నిర్మాణము కొరకు కొంత శక్తిని, సహాయ, సేవ రూపములలో ఆహ్వానిస్తున్నాము. దాతలు విరాళములు పంపదలచినవారు డ్రాప్టులు లేదా చెక్కులు: "పవర్ మినిస్ట్రీస్, గుంటూరు" పేరున పంపగలరు.
విరాళాలు:

పైన తెలుపబడిన నిర్మాణము కొరకు ఆసక్తి కలిగిన వారు విరాళములు ఇవ్వదలచిన దాతలు ఈ క్రింది చెప్పబడిన బ్యాంకు వివరములు గమనించవలసినదిగా మనవి. దాతలు తమ శక్తి కొలది విరాళాలు ఇచ్చి ఈ సత్కార్యాన్ని ప్రోత్సాహించవలసిందిగా కోరుతున్నాము. దాతలు తమ విరాళాలను నగదు రూపంలో ఇవ్వవచ్చు.


డిమాండ్ డ్రాప్టులు లేదా చెక్కులు:


"పవర్ మినిస్ట్రీస్, గుంటూరు” పేరు మీద పంపగలరు. లేదా దాతలు నేరుగా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నగరంపాలెం (గుంటూరు), శాఖ ఖాతానందుగాని (అకౌంట్ నెంబర్: 31921573191, ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్: SBIN0013483) విరాళాలను జమ చేసి రసీదును పొందవచ్చు. మీరిచ్చే విరాళాలకు సంస్థ నుంచి సరైన రసీదు పొందండి.


ధన్యవాదాలతో

ఇట్లు మీ భవదీయురాలు


జిడుగు మహలక్ష్మి




1 comment: